వరద ప్రవాహంలో చిక్కుకున్న పశువుల కాపరులను కాపాడటం కష్టంగా మారడంతో హెలికాప్టర్ ద్వారా వారిని సురక్షితంగా ఇవతలి గడ్డకు తరలించడంపై అధికారులు దృష్టి పెట్టారు. ఘటన స్థలానికి చేరుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ,ఎస్పీ మహేష్ బి.గితే ఆపదలో చిక్కుకున్న, గల్లంతైన రైతుల కుటుంబాలతో మాట్లాడారు.ఆపదలో చిక్కుకున్న పశువుల కాపరులతో ఫోన్ ద్వారా మాట్లాడి ధైర్యం చెప్పారు. సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో అధికారులు మాట్లాడి పరిస్థితిని వివరించారు.