చంద్ర గ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి కదిరి శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ తలుపులు మూసివేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈనెల 7న సంపూర్ణ చంద్రగ్ర హణం ఏర్పడనుంది. ఆదివారం ఉదయం అభిషేక సేవలు, నిత్య కైంక ర్యాలతో భక్తులకు దర్శనం కల్పించి, మధ్యాహ్నం ఒంటి గంటకు ఆలయం మూసివేస్తారు. రాత్రికి పూజా కైంకర్యాలు జరగవు మరుసటి రోజు సోమవారం ఉదయం 6 గంటలకు ఖాద్రీశుని ఆలయ తలుపులు తెరుస్తారు. ఆలయ శుద్ధి, పుణ్యాహవాచనం, నిత్య ప్రత్యాబ్దికమం, ఆలయ ప్రోక్షణతో పరివార దేవతలకు పులికాపు, తిరుమంజనం చేసి, శ్రీవారికి నివేదనతో ఆరాధన తర్వాతఉదయం 8.30 గంటలకు భక్తులకు దర్శనం కల్పిస్తారు.