అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలోని 35వ వార్డు కౌన్సిలర్, టీడీపీ సీనియర్ నాయకుడు మహమ్మద్ షరీఫ్ మృతి చెందారు. రెండు కిడ్నీలు పాడై గత ఏడాది కాలంగా డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం రాత్రి మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్ గురువారం షరీఫ్ స్వగృహానికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. షరీఫ్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.