దమ్మపేట మండలం పట్వారి గుడెం వద్ద పోలీసులు, టాస్క్ ఫోర్స్ సంయుక్త వాహన తనిఖీల్లో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాని పోలీసులు పట్టుకున్నారు.ఒరిస్సా ప్రాంతం నుండి చెన్నై తీసుకువెళ్లడానికి 86 కిలోల నిషేధిత గంజాయిని నలభై ప్యాకెట్ లు పంజాబ్ కి చెందిన ఇన్నోవా కార్ కి తెలంగాణ రిజిస్ట్రేషన్ ఫేక్ బోర్డ్ పెట్టి రవాణా చేస్తుండగా పట్వారిగూడెం వద్ద తనిఖీల్లో కార్ లో గంజాయి గుర్తించిన పోలీసులు కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని,86 కేజీ ల గంజాయి స్వాధీనం చేసుకుని, ఆరు మొబైల్స్ ,ఇన్నోవా కార్ సీజ్ చేసినట్లు పాల్వంచ డిఎస్పి విలేకరుల సమావేశంలో శుక్రవారం వెల్లడించారు