మార్వాడీలకు వ్యతిరేకంగా నల్గొండ జిల్లా, మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో శుక్రవారం ఉదయం భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వర్తక సంఘం అధ్యక్షుడు హరి ప్రసాద్ మాట్లాడుతూ.. గుజరాత్, రాజస్థాన్ల నుండి తెలంగాణకు మార్వాడీలు వలస వచ్చి స్థానిక వ్యాపారులను తీవ్రంగా నష్టపరుస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ బచావో, మార్వాడి హటావో అంటూ నినాదాలు చేశారు. వ్యాపారాన్ని నమ్ముకున్న తమకు మార్వాడీల వల్ల రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి జీఎస్టీ ఎగవేస్తూ తక్కువ ధరకే వస్తువులను విక్రయిస్తూ వ్యాపారాలను దెబ్బతీస్తున్నారు అన్నారు.