అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని బెలుగుప్ప తాండ గ్రామంలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు జరిగిన గౌరసంద్రం మారెమ్మ జాతర పూజ కార్యక్రమంలో భాగంగా కొండముళ్లు కంపలపై శయనించి అమ్మవారి పట్ల భక్తిని చాటాడు అర్చకుడు చంద్ర నాయక్. బెలుగుప్ప తాండ గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా ఆచార సంప్రదాయాల్లో భాగంగా అర్చకులు చంద్రనాయక్ గౌరసంద్రం మారెమ్మ అమ్మవారి ప్రతి ఒక్క ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామోత్సవం అనంతరం అమ్మవారి కట్ట వద్ద ముళ్ళ కంపలపై పడుకొని భక్తిని చాటాడు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని తిలకించి అమ్మవారిని దర్శించుకున్నారు.