రైతుల సమస్యలపై తాడేపల్లిగూడెం నియోజకవర్గం రైతులతో పాదయాత్రగా వైఎస్ఆర్సిపి నేతలు వెళ్లి తాడేపల్లిగూడెం ఆర్డిఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మాజీ డిప్యూటీ సీఎం మాజీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, తణుకు మాజీ శాసన సభ్యులు మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వర రావు, నర్సాపురం పార్లమెంట్ అబ్జర్వ్ వెటర్ ముదునూరి మురళీ కృష్ణ రాజు, నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలు గిట్టుబాటు ధరలు లేవు అని అన్నారు.