సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పనిని నైపుణ్యాన్ని బట్టి స్కిల్ వేతనాలు హైలీ స్కిల్డ్ వేతనాలు అమలు చేయాలని సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ప్రధాన కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా ను చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా జేఏసీ నేతలు రమేష్,యాకయ్యా మాట్లాడుతూ.. 2017 సంవత్సరంలో స్కిల్ పనులకు స్కిల్ వేతనాలు చెల్లించే విధంగా కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోట్ సింగరేణి యాజమాన్యానికి ఇచ్చినప్పటికీ సింగరేణిలో మాత్రం ఎందుకు అమలు చేయడం లేదని వారు ప్రశ్నించారు.