సిద్దిపేట జిల్లా అక్బర్ పేట - భూంపల్లి చిన్న నిజాంపేట గ్రామంకు చెందిన ముగ్గురు వ్యక్తులు షేర్ల గోపాల్, షేర్ల రాజు, చింతల సుదర్శన్ లు బుధవారం పొలం పనుల నిమిత్తం పోతరెడ్డి పేట చెరువు కట్ట సమీపానికి పనికి వెళ్లి ఉదృతి పెరగడంతో అక్కడే చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, దుబ్బాక సీఐ శ్రీనివాస్,ఎస్ఐ హరీష్, సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి వారికి వారిని సురక్షిత ప్రాంతంలో ఉంచారు. ఈ మేరకు గురువారం చెరువు గట్టుపై చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులను రాష్ట్ర ఎస్డిఆర్ఎఫ్, బృందాలు రెవిన్యూ, స్థానిక పోలీసులు బృందాలు బోట్ సహాయంతో సురక్షితంగా బయటకు తీస