నల్గొండ జిల్లా, డిండి మండల పరిధిలోని బొల్లనపల్లి గేటు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి డిండి ఎస్ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు బైకుపై శ్రీశైలం వెళ్లి తిరిగి వస్తుండగా,అతివేగంతో వెళ్తున్న బైకు అదుపు తప్పి కింద పడడంతో మధ్యలో కూర్చున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించినట్లు తెలిపారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై బాలకృష్ణ పేర్కొన్నారు