ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం స్థానిక పంగిడిగూడెం రోడ్డులో మీసేవ కేంద్రం వద్ద లారీ టైర్ కింద పడి వృద్ధుడు అక్కడికక్కడే మృతి మృతుడు 60 సంవత్సరాల వయసు గల తిరుమలపురం గ్రామానికి చెందిన రామయ్య గా గుర్తింపు సమాచారం తెలుసుకున్న పోలీసులు గురువారం ఉదయం 11 గంటల సమయంలో సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు . పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం లారీ అతివేగంగా రావడంతో సమీపంలో ఉన్న వృద్ధుడు పైకి దూసుకు వెళ్లి లారీ టైర్ కింద పడి మృతి చెందినట్లు తెలిపారు