మట్టి ప్రతిమలతో వినాయక చవితిని జరుపుకోవడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ కోరారు.పట్టణంలో వినాయకుని మట్టి ప్రతిమల తయారీలో విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు ఆయన ఆదివారం రాత్రి బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా మట్టి ప్రతిమల తయారీలో విద్యార్థులు ప్రదర్శించిన నైపుణ్యాన్ని ఎమ్మెల్యే అభినందించారు. ప్రజలు కూడా ఆర్భాటాలకు పోకుండా మట్టి ప్రతిమలతో వినాయక చవితి జరుపుకోవాలని జనార్ధన్ సూచించారు