నల్గొండ జిల్లా, దేవరకొండ మండల వ్యవసాయ అధికారి కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు గురువారం మధ్యాహ్నం వాగ్వాదానికి దిగారు. గత మూడు రోజుల నుండి యూరియా కోసం తిరుగుతున్న దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదాం లో నిల్వ ఉన్న లేదని చెప్తూ, యూరియాను బహిరంగ మార్కెట్ కు తరలిస్తున్నారని రైతులు ఆరోపించారు. గోదాం తీర్చి చూపించాలని అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు.