Download Now Banner

This browser does not support the video element.

శ్రావణ శుక్రవారం 5 మరియు చివరి వారం కావడంతో, పెద్దాపురం మరిడమ్మ ఆలయం నందు సామూహిక వరలక్ష్మి వ్రత పూజలు నిర్వహించారు.

Peddapuram, Kakinada | Aug 22, 2025
కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానం నందు, 22-8-25వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి శ్రావణమాసంలో ఐదవ మరియు చివరి శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రత పూజలను ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మరియు కార్యనిర్వాహణ అధికారి విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మరిడమ్మ అమ్మవారిని వేరుశెనగ కాయలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఆలయ అర్చకులు మహిళలచే సాంప్రదాయ పద్ధతిలో వరలక్ష్మి వ్రత పూజలను చేయించారు. పూజలు అనంతరం మహిళలకు తీర్థ ప్రసాదాలను అందజేసినట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us