అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండల పరిధిలోని కాసేపల్లి గ్రామ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై టోల్ గేట్ సమీపంలో బైక్ అదుపు తప్పి బోల్తా పడి సుధాకర్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు, బాధితుడు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా గంగవరం మండలం నల్లసానిపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ గుంతకల్లులో గత కొన్ని నెలలుగా కొబ్బెర మొక్కలు, గాజులు విక్రయించే వాడు. నల్లసానిపల్లి నుంచి బైక్ లో గుంతకల్లుకు వెళ్తుండగా మంగళవారం టోల్ గేట్ సమీపంలో కుక్క అడ్డు రావడంతో వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపు తప్పి బోల్తా పడింది. చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించారు.