జగిత్యాల జిల్లా మల్యాల మండలం, కొండగట్టు పెట్రోల్ పంపు సమీపంలో ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయిన ఘటన గురువారం 8:40PM కి చోటుచేసుకుంది,తన ద్విచక్ర వాహనంపై రాజశేఖర్ జగిత్యాల వైపు నుండి కరీంనగర్ వైపు వెళుతూ,తన ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పోసుకొని కాస్త దూరం వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన భారీ వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి ఆగకుండా వెళ్ళిపోయింది, పడిపోయిన రాజశేఖర్కు తీవ్ర గాయాలయ్యాయి,ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన వాహనాన్ని యువకులు వెంబడించిన ఆగకుండా వెళ్ళిపోయింది,రాజశేఖర్ పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ వాహనంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు,