జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీ జెండా బాలాజీ ఆలయం ఇందూరు తిరుపతిగా పేరుంది. భక్తుల పాలిట కొంగుబంగారంగా మారిన ఈ ఆలయంలో జెండా జాతర నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ లవంగం ప్రమోద్ మాట్లాడుతూ ఈనెల 24వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు జెండా బాలాజీ జాతర కొనసాగుతుందని చెప్పారు. ఈనెల 24వ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటలకు స్వామివారి జెండా ఉత్సవ మూర్తులను వంశపారంపర్య అర్చకులు అజయ్ సంగ్వాయ్ ఇంటి నుంచి జెండా పూజానంతరం ఊరేగింపుగా శ్రీ జెండా బాలాజీ మందిరం వరకు ఉత్సాహమూర్తులను ఊరేగించి ప్రతిష్టిస్తారని ఆయన తెలిపారు