మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం ముంగిమడుగులోని తెలంగాణ క్రీడా ప్రాంగణలు నిరూపయోగంగా మారాయని గ్రామస్థులు ఆదివారం మధ్యాహ్నం 3:00 లకు ఆరోపించారు. తెలంగాణ క్రీడా ప్రాంగణం ఉపయోగంలో లేకపోవడంతో పిచ్చి చెట్లు, ముళ్ల కంప పెరిగిందని మండిపడ్డారు. క్రీడా ప్రాంగణం సరైన నిర్వహణ లేక శిథిలావస్థకు చేరిందని, దీంతో యువత ఆడుకోవడానికి ఇబ్బంది పడుతున్నారన్నారు.ఇప్పటికైన అధికారులు స్పందించి క్రీడా ప్రాంగణం ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.