ప్రభుత్వ ఆదేశాల మేరకు వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం లభించింది.ఈ క్రమంలో బాపట్ల పట్టణంలోని వినాయక మండపాలలో బుధవారం రాత్రి విద్యుత్ సిబ్బంది మీటర్లు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా విద్యుత్ శాఖ డీఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ మండపాల నిర్వాహకులు తమను సంప్రదించినట్లయితే ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తూ మండపాలలో ప్రత్యేక మీటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.అలాగే విద్యుత్ ప్రమాదాలు జరగకుండా కూడా చూస్తామన్నారు.