ఇంటింటికి రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న వాహనాలను రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎండియు ఆపరేటర్లు శనివారం కోటవురట్ల తాహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన జరిపారు. అనంతరం తాహసిల్దార్ తిరుమల బాబుకు వినతి పత్రం అందజేశారు.