ఇచ్చోడ మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోందని మాదాపూర్ గ్రామ యూత్ ప్రెసిడెంట్ ఎస్. కె అర్బాజ్ తెలిపారు. మాదాపూర్ గ్రామ సమీపంలో ఓ రైతు వ్యవసాయ పొలంలో మహిళలు పత్తి తీసే క్రమంలో కనిపించిందని గ్రామస్తులు గురువారం తెలిపారు. ఈ విషయంపై ఫారెస్ట్ అధికారి నౌసిలాల్ కు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకొని పంట పొలాల్లో గాలింపు చర్యలు చేశారు. పాదముద్రల సేకరణ చేపట్టారు.