గంజాయితో ఆంధ్ర ప్రదేశ్ అడ్డాగా మారిందని డీఎస్సీ పేరుతో ప్రభుత్వం యువతను నట్టేట మోసం చేస్తుందని టిడిపి జిల్లా అధికార ప్రతినిధి చెంచు రామయ్య గూడూరులో తెలిపారు.. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. యువతకు ఉద్యోగాలు ఇస్తారంటూ హామీ ఇచ్చి ప్రజల్ని యువతను మోసం చేసిందని ఆయన చెప్పుకొచ్చారు.