కొయ్యూరు మండలంలోని రైతులు ఎరువుల కోసం రాజవొమ్మంగి లేదా కృష్ణదేవిపేటలోని ఎరువుల దుకాణాలపై ఆధారపడతారని మంప సెగ్మెంట్ ఎంపీటీసీ మాజీ సభ్యుడు శివరామరాజు బుధవారం మధ్యాహ్నం కొయ్యూరులో తెలిపారు. అయితే ఆయా దుకాణాల్లో యజమానులు యూరియా కొరత సృష్టించడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. యూరియా బస్తాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలిపారు. అలాగే వేరే ఎరువు తీసుకుంటేనే యూరియా ఇస్తామని వ్యాపారులు చెబుతున్నారన్నారు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.