కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా నుండి జీవదాన్ పాఠశాలకు వెళ్లే దారిలో గల 40 ఫీట్ల పొడవైన నాలాను ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టారని దీనివల్లనే వర్షాలు పడినప్పుడు రోడ్లపైన నీళ్లు నిలిచిపోయి ఆ నీళ్లే ఇళ్లలోకి వచ్చి ప్రజలు ముంపు బారిన పడే విధంగా చేస్తున్నాయని కామారెడ్డి శ్రేయస్సును ఆకాంక్షించే ప్రజలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. మాస్టర్ ప్లాన్ లో ఉన్న విధంగా 40 ఫీట్ల రోడ్డు ఎక్కడ ఉందని ప్రశ్నించారు.జిల్లా కలెక్టర్ మరియు యంత్రాంగము ఒకసారి సందర్శించి 40 ఫీట్ల నాలాలలో ఎలాంటి ఆక్రమణలు జరిగాయో చూడాలి అని అన్నారు.