మహబూబాబాద్ జిల్లా కేసముద్రం లో రైతన్నల కోసం లారీ డ్రైవర్ గా మారిన కానిస్టేబుల్ అలీమ్ ను జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ శుక్రవారం ఉదయం 8:00 లకు శాలువాతో సన్మానించారు.. సకాలంలో యూరియా రైతులకు అందించాలనే జిల్లా ఎస్పీ పడుతున్న తపన కష్టం తనని కదిలించిందని, తన బాధ్యతగా భావించి అధికారుల అనుమతితో ఆ పని చేశానని కానిస్టేబుల్ తెలిపారు. దీంతో రైతుల కోసం సమాయస్ఫూర్తితో స్పందించిన తీరును ప్రశంసిస్తూ ఎస్పీ అభినందించారు