కనిగిరి నియోజకవర్గం లోని 6 మండలాల్లో రైతులకు ఎరువులు మరియు పురుగుమందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని కనిగిరి ఏఎంసీ చైర్మన్ యారవ రమా శ్రీనివాసులు అన్నారు. హనుమంతునిపాడు రైతు సేవా కేంద్రాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వారికి అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సహకారంతో రైతుల సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడిఏ జైనులాబ్దిన్, రైతులు పాల్గొన్నారు.