బెల్లంపల్లి మండలం తాళ్లగురిజాల గ్రామం ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన కన్నాల గ్రామానికి చెందిన పుల్లగొర్ల పుష్పలత అనే మహిళ అరెస్ట్ చేసినట్లు బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్ తెలిపారు ఈ సందర్బంగా అయన తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 22వ తేదీన ఇండోర్ చంద్రశేఖర్ అనే వ్యక్తి ఇంట్లో ఎవరు లేని సమయంలో పుష్పలత చొరబడి బీరువా తాళాలు పగలగొట్టి రెండు తులాల బంగారం 15 వేల రూపాయల నగదు దొంగతనం చేసిందన్నారు చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా పుష్పలత దొంగతనం చేసినట్లు తేలింది దీనితో ఆమెను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు