అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలో మిలాదున్-నబీ పండుగను పురస్కరించుకొని మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కేశాలను ప్రదర్శనకు ఉంచారు. గుత్తి పట్టణంలోని సాహెబ్ కట్ట, గుత్తి కోటలోని ఆసార్ మసీదు, గుత్తి అర్ఎస్ బండిమోటు విధులలో శుక్రవారం మహమ్మద్ ప్రవక్త కేశాలను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మౌల్వీలు మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర విశేషాలను వివరించారు. ప్రత్యేక ఫాతేహాలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.