ఎల్లారెడ్డి : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానతో జిల్లా అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద పోటెత్తడంతో పలు చోట్ల చెరువులు తెగిపోయాయి. రోడ్లు కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎల్లారెడ్డి పట్టణ శివారులోని వడ్డెర కాలనీ వద్ద ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రధాన రహదారిపై వరద పొంగిపొర్లడంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. మండలంలోని బ్రాహ్మణపల్లి వద్ద రుద్రారం- ఎల్లారెడ్డి మధ్యలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కొట్టాల్ – లక్ష్మాపూర్ వంతెన వరద తాకిడికి తెగిపోయింది. అత్యవసరం అయితే 100 డయల్ చేయండి అధికారులు తెలిపారు.