కడివెళ్ల: వీధికుక్కల దాడిలో మూడో తరగతి విద్యార్థికి గాయాలు..ఎమ్మిగనూరు మండలం కడివెళ్ల గ్రామంలో గురువారం వీధి కుక్కలు దాడి చేయడంతో మూడో తరగతి విద్యార్థి బడేసాబ్ గాయపడ్డాడు. ఊరిలో తిరుగుతుండగా కుక్కలు అకస్మాత్తుగా దాడి చేయడంతో బాలుడు కేకలు వేశాడు. స్థానికులు స్పందించి కుక్కలను తరిమివేసి బాలుడిని రక్షించారు. అతడిని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నెల రోజుల క్రితం ఇదే గ్రామంలో కుక్కకాటుతో ఒక వ్యక్తి మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు.