అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని దమ్మపేట పోలీసులు సోమవారం సీజ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం దమ్మపేట ఏఎస్ఐ బాల స్వామినాథం సోమవారం తన సిబ్బందితో కలిసి గాంధీనగర్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో గజ్జవరం ర్యాంపు నుండి ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ను ఆపి తనిఖీ చేశారు. అనుమతి పత్రాలు ఏమీ లేకపోవడంతో టిప్పర్ను సీజ్ చేశారు. టిప్పర్ డ్రైవర్ అమ్మిరాజు, ఇసుక వ్యాపారి గన్ని రాజులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి తెలిపారు.