రైతులకు అవసరమైన యూరియా ఎరువులు అందుబాటులో ఉంచడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు, రాష్ట్రంలో యూరియా కొడతా రైతుల పడుతున్న ఇబ్బందులపై వైసిపి ఆధ్వర్యంలో మంగళవారం అనకాపల్లిలో నిర్వహించిన అన్నదాత పోరు కార్యక్రమంలో మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు పాల్గొని ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.