రాష్ట్రంలో యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగభృతి అంటు వాగ్ధానాలు చేసి, విస్మరించిన చంద్రబాబు మోసాన్ని ప్రశ్నిస్తూ నేడు (సోమవారం అంటే ఈనెల 23వ తేదీన) రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు నిర్వహిస్తున్నట్లు ఆదివారం సాయంత్రం మాజీ మంత్రి, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. వైయస్ఆర్‌సీపీ విశాఖ నగర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద శాంతియుతంగా నిరసనలు తెలిపి, తమ డిమాండ్ పత్రాలను కలెక్టర్‌లకు అందచేస్తారని తెలిపారు.