మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ అవగాహన ర్యాలీని కాకినాడ జిల్లా పెద్దాపురం పాసిల వీధి సచివాలయం 4, 5. వార్డుల నుంచి పెద్దాపురం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దాపురం నియోజవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప స్థానిక వార్డు ప్రజలకు వాట్సప్ గవర్నెన్స్ సేవలపై శనివారం ఉదయం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలకు పలువురు మహిళలకు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ యొక్క ఉపయోగాలను గురించి వివరించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, తూతిక రాజు పలువురు తెలుగుదేశం యువనాయకులు కార్యకర్తలు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.