నల్గొండ మండల పరిధిలోని అప్పాజీపేట గ్రామంలో యూరియా కోసం రైతులు రైతు వేదిక వద్ద శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకు పడి కాపులు కాశారు. సాయంత్రానికి ఒక యూరియా లారీ రావడంతో మూడు గ్రామాల ప్రజలకు యూరియా దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతూ నిరాశతో వెనుతిరిగారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారులు స్పందించి సరిపడా యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.