వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం పాకాల శివారు ప్రధాన రహదారి పక్కన అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున గంజాయి డంపును సోమవారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గంజాయి డంపు నిలువ చేసి ఉందన్న సమాచారంతో పోలీసులు డంప్ పై దాడులు నిర్వహించి 750 కిలోల గంజాయిని స్వాధీనం. గంజాయిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలతో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేసినట్లు విశ్వసనీయ సమాచారం ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.