యాదాద్రి భువనగిరి జిల్లా, అడ్డగూడూరు మండల పరిధిలోని ధర్మారం గ్రామంలోని బిక్కేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ ను మంగళవారం సాయంత్రం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ఎమ్మెల్యే చెక్ డ్యాములను నిర్లక్ష్యం చేస్తే సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడి రూ.30 కోట్ల నిధులు మంజూరు చేయించి నియోజకవర్గంలో ఉన్న ఆరు చెక్ డాం లను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఆ చెక్ డాంలు ఇప్పుడు నిండుకుండలా మారి జలకలను సంతరించుకున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి సాగునీరు అందించేందుకు పెద్దపీట వేస్తుందన్నారు.