యూరియా కోసం క్యూలైన్లు, తోపులాటలు, కొట్లాటలు జరిగిన ఘటనలు చూశాం..శనివారం మధ్యాహ్నం 3:00 లకు మరో దారుణ ఘటన రైతుల దయనీయ పరిస్థితిని తెలియజేసింది.మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ఫర్టిలైజర్ షాప్స్ వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు క్యూకట్టారు. అయితే రైతు వేదిక వద్ద టోకెన్లు ఇస్తానని చెప్పిన అగ్రోస్ నిర్వాహకుడు మట్టి దిబ్బ ఎక్కి వాటిని గాల్లోకి విసిరేశాడు. రైతులు కొట్లాడుతూ టోకెన్లను ఏరుకున్నారు..ఏది ఏమైనా ప్రభ్యత్వం అధికారులు తమకు తక్షణమే యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నారు.