రేపల్లె పోలీసులు తప్పిపోయిన 11 ఏళ్ల బాలిక కరుణను కొద్ది గంటల వ్యవధిలోనే ఆమె తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. ఈ నెల 2వ తేదీ సాయంత్రం బాలిక స్కూల్ కి వెళ్లి తిరిగి రాకపోవడంతో తల్లి రాములమ్మ ఫిర్యాదు చేశారు. ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు, రేపల్లె డిఎస్పి ఆవల శ్రీనివాసరావు, పట్టణ సిఐ మల్లికార్జునరావు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బాలిక నేతాజీ నగర్ లోని సచివాలయంలో ఉన్నట్లు గుర్తించారు. బుధవారం బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు.