కరీంనగర్ NSUI ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీ ముందు RSS - BJP దిష్టిబొమ్మను శుక్రవారం దగ్ధం చేశారు.NCERT మాడ్యూళ్ళులను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా NSUI నాయకులు మాట్లాడుతూ దేశ విభజన పరిణామాలను వివరించడానికి NCERT అనే ఒక ప్రత్యేక మ్యాడ్యుల్ ను విడుదల చేసిందని, అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ను విభజనకు బాధ్యులుగా పేర్కొనడాన్ని తీవ్రంగా ఖండించారు.చరిత్రను వక్రీకరిస్తూ రాబోయే తరం విద్యార్థులలో ఆర్ఎస్ఎస్ బిజెపి సిద్ధాంతాలను నింపాలని చూస్తున్నారన్నారు.