కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం స్థానిక మఠం సెంటర్ వద్ద గతంలో రామాలయం ఉన్న ప్రదేశంలో వాటర్ ఫౌంటెన్ పెట్టేందుకు మంగళవారం ఉదయం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప స్థానిక టిడిపి నాయకులతో కలిసి స్థలాన్ని పరిశీలించడం జరిగిందని టిడిపి నాయకులు మంగళవారం సాయంత్రం 6 గంటలకు మీడియాకు ప్రకటనలో తెలియజేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్య మున్సిపల్,ఇంచార్జ్ చైర్పర్సన్ గోకిన సునత్ర దేవి లతో చర్చించారు. సామర్లకోట పట్నం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మఠం సెంటర్ వద్ద వాటర్ ఫౌంటెన్ ఏర్పాటుకు ఏర్పాటు చేసే క్రమంలో స్థలాన్ని పరిశీలనట్లు తెలిపారు.