గ్రామీణ నేపథ్యం నుంచి ఎదిగిన ప్రముఖ వ్యాపారవేత్త ఏనుగు దయానంద్ రెడ్డిని స్ఫూర్తి గా తీసుకొని ప్రభుత్వ పాఠశాలలకు సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోరారు. జిల్లాలోని 40 ప్రభుత్వ పాఠశాలలకు స్పోర్ట్స్ మెటీరియల్ అందించిన దయానంద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఇది రాజకీయాల కోసమో పేరు కోసమో చేస్తున్న కార్యక్రమం కాదనీ ఆయన స్పష్టం చేశారు. ఆదివారం బాల్కొండ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి నిజమాబాద్ జిల్లాలోని సుమారు 40 పాఠశాలల విద్యార్థులకు సుమారు 20 లక్షల రూపాయలతో స్పోర్ట్స్ మెటీరియల్, స్పోర్ట్స్ దుస్తుల పంపిణి కార్యక్రమం నిర్వహించారు.