ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగులగొట్టి.. వంగపహాడ్‌లో రెవెన్యూ అధికారుల దౌర్జన్యం ప్రభుత్వ భూమిలో ఇండ్లు కట్టుకున్నారని ఆరోపణ 30 ఏండ్లుగా ఇక్కడే ఉంటున్నామంటున్న బాధితులు సర్వే నంబర్ తప్పుగా చూపిస్తున్నారంటూ ఆగ్రహం తమ ఇండ్లకు వేసిన తాళాలను పగులగొట్టి రెవెన్యూ అధికారులు దౌర్జన్యం చేశారంటూ బాధితులు వాపోయారు. బాధితుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌కు చెందిన ముస్కు రాజమౌళి, విష్ణువర్ధన్, వసంత్‌కుమార్, అన్నపరెడ్డి అపర్ణ వేర్వేరుగా కట్టుకున్న మూడు ఇండ్లు ప్రభుత్వ భూమిలో ఉన్నాయని గుర్తుతెలియని వ్యక్తి పిటిషన్ ఇచ్చాడు. దాని ఆధారంగా హసన్‌పర్తి తహసీల్దార్