రాజధాని అమరావతి ప్రాంతంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు తమ రెండు నెలల బకాయి జీతాలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ నిరసన ర్యాలీ చేపట్టారు. తుళ్లూరులో ప్రతి శుక్రవారం జరిగే గ్రీవెన్స్ డే కార్యక్రమానికి వినతిపత్రం ఇచ్చేందుకు భారీగా తరలివచ్చిన కార్మికులు, సిఆర్డిఏ కార్యాలయం ముందు బైఠాయించి, తక్షణమే జీతాలు విడుదల చేయాలని, కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు.