చీరాల వైకుంఠపురంలోని 32 వ నెంబర్ రేషన్ దుకాణం నుండి సోమవారం తెల్లవారుజామున రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఎండియు వాహనంలో తరలిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. వారి సమాచారం మేరకు పౌరసరఫరాల శాఖ డి.టి గీతా రాణి, ఏఎస్ఐ నాగరాజు అక్కడికి చేరుకొని సదరు వాహనాన్ని తనిఖీ చేయగా 40 బస్తాల రేషన్ బియ్యం దొరికింది.దీంతో వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. డీలర్ పై సిక్స్ ఏ కేసు నమోదు చేశారు. సమగ్ర విచారణ జరిపిస్తామని డి.టి గీతారాణి చెప్పారు.