ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి సంబంధించి, ప్రొవిజనల్ గా ఎంపికైన పాడేరు డివిజన్ పరిధిలోని 11 మండలాలకు చెందిన అభ్యర్థులకు ఈనెల 26వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టీ.విశ్వేశ్వరనాయుడు ఆదివారం సాయంత్రం తెలిపారు. ప్రొవిజనల్ గా ఎంపికైన అభ్యర్ధులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాడేరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 10గంటల నుంచి జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు.