ఓ ఇద్దరిని బెదిరించి కిడ్నాప్ చేసిన ఘటనలో కరీంనగర్ కొత్తపల్లి పోలీసులు ఐదుగురిని అరెస్టు చేసినట్లు గురువారం తెలిపారు. సీఐ కోటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం కొత్తపెళ్లి శివారులోని ఓ హోటల్ లో యశ్వంత్, మధు అనే వ్యక్తులను 9 మంది బెదిరించి కిడ్నాప్ చేసి కారులో తీసుకువెళ్లి డబ్బులు వసూలు చేశారని బాధితులు ఏడవ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు నరేష్, శేఖర్, అశోక్ ,ఉపేందర్ గుడిమల్ల సివిల్ అనే వ్యక్తులను అరెస్టు చేసి వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం రాత్రి వైద్య పరీక్షలు నిర్వహించి , రాత్రి కావడంతో గురువారం రిమాండ్ చేసినట్లు తెలిపారు.