అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలోని రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద అనకాపల్లి నుండి విజయనగరం వెళ్లే బస్సు ఆగిపోయింది. శనివారం నాడు రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద బస్సు ఆగిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.