కరీంనగర్ లోయర్ మానేరు జలాశయంలో ఓ మత్స్యకారునికి 25 కిలోల బొచ్చే చేప వలలో చిక్కిందని సోమవారం తెలిపారు. తిమ్మాపూర్ మండలం ఇందిరా నగర్ సంగంపల్లి కి చెందిన కూన సంపత్ కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ లో చేపలు పట్టేందుకు వలవేశారు. ఆ వాళ్లకు 25 కిలోల చాప దొరికినట్లు వెల్లడించారు. చాలా సంవత్సరాల నుంచి చేపలు పడుతున్నాను, కానీ ఎప్పుడూ ఇంత పెద్ద చేప వలకు చిక్కలేదని సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఆ చేపను చూసేందుకు తోటి మత్స్యకారుల తో పాటు, స్థానిక ప్రజలు ఆసక్తి చూపారు.