సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) లో వినాయక చవితి వేడుకను పురస్కరించుకుని సోమవారం జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులకు, ఉద్యోగులకు మట్టి గణపతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను కాలుష్య నియంత్రణ మండలి ఉచితంగా పంపిణీ చేస్తుందని తెలిపారు. పర్యావరణ సమతుల్యత కోసం మట్టి విగ్రహాలను ప్రతిష్టించాలన్నారు. . ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇతర రసాయనిక రంగులతో రూపొందించిన విగ్రహాల కారణంగా జల వనరులు కలుషితం అయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రజలందరూ మట్టి గణపతులను ప్రతిష్టించి, పర్యావరణ పరిరక్షణకు దోహదపడా